www.adilabadyatra.com

Connecting adilabad to the globe.

  • Home
  • Blog
  • News zone
  • Nirmal Tour
  • Contact Us

our site visitors hit counter

ఆదివాసీ పోరుబిడ్డ భీం!


అక్టోబర్ 29 కొమురం భీం వర్థంతి
భారతదేశ చరిత్రలో ఆధిపత్యం, అణచివేతలకు వ్యతిరేకంగా తొట్టతొలిగా ఆయు ధంపట్టి పోరాడిన ఘనత ఆదివాసులదే. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన పోరాటాల్లో ఆదివాసుల పాత్ర అనన్యమైనది. ఆంగ్లేయుల రాకకు పూర్వమే మధ్యప్రదేశ్, మహా రాష్ట్ర, ఒడిషా, ఆంధ్ర, తెలంగాణలోని ఆదివాసీ ప్రాంతాలను కలుపుతూ క్రీ.శ.1240-1749 మధ్య కాలంలో ‘గోండ్వానా’ ఆదివాసీ రాజ్యం విలసిల్లిందన్నది చరిత్ర. ఆంగ్లేయుల ప్రవేశంతో ఆది వాసీ తెగల స్థితిగతులు మరింత దుర్భరమయ్యాయి.
తరతరాలుగా అడవిపై సర్వహక్కులను అనుభవించిన ఆదివాసీలు ఆంగ్లేయుల వలస పాలనలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కోల్పోయి సొంత భూమిలో పరాయివారయ్యారు. బ్రిటిష్ తెల్లదొరల, నిజాం సేనల దమననీతికి వ్యతిరేకంగా 1836 నుంచి 1860 వరకూ రాంజీగోండు నాయకత్వంలో ఆదివాసీలు వీరోచితంగా పోరాడారు. రాంజీ గోండు పోరాటవారసత్వానికి ప్రతీకగా, 1900 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, కరిమెరి తాలూకా, సంకేపల్లి కుగ్రామంలో కొమురం చిన్నూ, మోహినీబాయి దంపతులకు కొమురం భీం జన్మించాడు. 15వ ఏట అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రిని కోల్పోయి కుటుంబంతో సహా కొమురం భీం తన మకాంను సర్ధాపూర్‌కు మార్చాడు. అటవీ అధికారులు, భూస్వాములు కలిసి జోడెన్‌ఘాట్ ప్రాంతంలోని ఇళ్ళను, పంటలను ధ్వంసం చేశారు.
సిద్ధికీ అనే జాగీర్‌దార్‌ను హత్యచేసి, ఐదేళ్ల పాటు అసోం రాష్ట్రంలో తలదాచుకున్న కొమురం భీం తేయాకు, కాఫీ తోటల్లో కార్మిక ఉద్యమాల్లో కరకుదేరాడు. ఆంగ్లేయులతో కలిసి నైజాం నవాబు సాగిస్తున్న ఆగడాలను మిత్రుడు కొమురం సూరు ద్వారా తెలుసుకుని తిరిగి జోడెన్‌ఘాట్ చేరుకున్నాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల్లోని 12 గ్రామాల యువకులను కూడగట్టి గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జోడెన్‌ఘాట్‌ను స్వతంత్ర ‘గోండురాజ్యం’గా ప్రకటించడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆసిఫాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు పెద్దల సలహా మేరకు, ఆదివాసీల కోర్కెలను అర్జీగా తయారు చేసి హైదరాబాద్‌లో నవాబును కలవడానికి చేసిన ప్రయత్నం విఫలంకావడంతో జోడెన్‌ఘాట్ కేంద్రంగా నిజాం సైన్యంపై గెరిల్లా యుద్ధాన్ని ప్రకటించాడు. కొమురం ప్రధాన అనుచరులు కొమురం సూరు, లచ్చుపటేల్‌లను సైన్యం నిర్బంధించింది. కొరియర్ కుర్దుపటేల్ అందించిన సమాచారంతో నిజాం సైనికులు జోడెన్‌ఘాట్ గుట్టల్లోని కొమురం భీం స్థావరాలను చుట్టుముట్టారు. 1940 సెప్టెంబర్ 1 ఆశ్వీయుజ మాసం, శుద్ధ పౌర్ణమి నాడు నిజాం సైనికులతో వీరోచితంగా పోరాడుతూ కొమురం నేలకొరిగాడు. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి ఆదివాసీల స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం అమరుడైన కొమురం భీం వర్థంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం ఆదివాసీలను వంచించడమే! ...more

మన జిల్లా సంస్కృతి

మన జిల్లా సాంప్రదాయం

Coming Soon..

PRESS NOTES

  • Eenadu(26/11/2011)
  • Eenadu(15/12/2011)

KALLUR SAIBABA

రాష్టంలోని ప్రసిద్ది చెందిన సాయిబాబా దేవాలయాలలోని మన జిల్లాలో కల్లూర్ లో ఉన్నటువంటి సాయిబాబా ఆలయం ఒకటి. ఈ ఆలయం కొండ పైన చాల విశాలంగా నిర్మించబడినది. పాలరాతి తో వెలిసిన సాయి మూర్తి విగ్రహం బక్తులను తన్మయత్వానికి గురిచేస్తుంది.జిల్లాలోని తప్పక చూడవలసిన ఆలయాలల్లో ఈ దేవాలయం ప్రముఖ స్థానంలో ఉంటుంది. ఇక్కడ నిత్యం సాయి నామస్మరనంతో ఆద్యాత్మికత పరిడవిల్లుతుంది..ప్రతి గురువారం సాయి కి ప్రత్యెక పూజలు నిర్వహించబడతాయి.ఈ ఆలయం నిర్మల్ నుండి భైంసా వెళ్ళే జాతీయ రహదారి మద్యలో దిలవార్పూర్ దాటగానే కల్లూర్ గ్రామం లో కుడివైపునకు ఉంటుంది.
Click hear for Photo Gallery

VISITORS CHOICE

  • Visitors Guest Book
  • Visitors articles

ADVT ZONE

ADVT ZONE

advt hear

EDUCATIONAL ZONE

  • Schools
  • Intermediat Colleges
  • Degree Colleges
  • PG Colleges
  • Engineering Colleges
  • Medical Colleges
  • Computer Institutions

POLICE & SECURITY

  • Police stations & Importent phone numbers

కడెం ప్రాజెక్ట్

advt hear

పచ్చని పొలాలు..ప్రకృతి అందాలు..ఎత్తైన కొండలు..జలపాతాలల జాలువారే నీళ్ళు కాశ్మీరమ అనిపించే పొగమంచు..నిండు కుండ లాంటి నీటిలో షికారు..అందాలన్నీ ఇక్కడే ఆవిష్కృతం అయినట్లుగా అబ్బుర పరుస్తాయి కడెం ప్రాజెక్ట్ పరిసరాలు.ఈ అద్బుతాలన్ని పర్యాటకులని విపరీతంగా ఆకట్టుకుంటాయి.మల్లి మల్లి వచ్చి అందాలను వీక్సిన్చేల మంత్రం ముగ్దులను చేస్తాయి.ప్రాజెక్ట్ పరిసరాలు అందాలకు నెలవుగా ఉంటాయి. సూర్యోదయం సుర్యస్తామాన సమయాలలో ప్రత్యెక అందాలు కనువిందు చేస్తాయి. ప్రాజెక్ట్ లో బోటు షికారు అయితే కొత్త హుశారునిస్తోంది.

advt hear

advt hear

DEDICATED THIS SITE TO T.G

DEVOTIONAL PLACES

  • Basar Saraswathi Temple
  • Jainath Temple
  • Wadyal Yellamma Temple
  • Ponkal Venkateshwara Swami
  • Adelli Pochemma
  • Bhurugupalli Shivallayam
  • Kadile Papa Harishwaralayam
  • Sirichelime Temple
  • Laxettipet Church
  • Gudem Satyanarayana Swami
  • Sadalpur Temple
  • Pendalvada Temple
  • Gopal Krishan Matam
  • Bhadi Temple
  • Vigneshwaralayam, Asifabad
Click hear for view more..

POPULAR JATARAS

  • Nagoba Jatara, Keslapur
  • Anjaneyaswami Jatara, Darmaram

ఒక్క సారి తెలుసుకోండి ..!!

  • పోరాటాల పురిటి గడ్డ..నిర్మల్
  • నిజాం గుండెల్లో నిద్ర పోయిన కొమురం భీం
  • మన జిల్లా శిలల ఖిల్లా
  • నిర్మల్..ఒక వైవిధ్య పట్టణం
  • జీవ వైవిద్యానికి రాష్టంలోనే పుట్టినిల్లు మన జిల్లా
  • ఇంద్రవెల్లి : విప్లవాల పాలవెల్లి

PHOTO GALLERY

  • Laxmanchanda Mandal Devotional & Other attractions

WATERFALLS & NIRMAL TOUR

  • Kuntala Waterfall
  • Pochera Waterfall
  • Hills & Rivers
  • Nirmal Toys
  • Nirmal Paintings
  • Nirmal Forts
  • Nirmal Toys Workshop

Quick Tour

PROJECTS

  • Kadam Project
  • Sriramsagar Project
  • Swarna Project
  • Sadarmatt Anicut
  • Siddhapur Vaagu
  • Sathnala Reservoir

WILDLIFE SANCTUARIES

  • Kawal Wildlife Sanctuary
  • Pranahitha Wildlife Sanctuary
  • Sivaram Wildlife Sanctuary

DISTRICT OVERVIEW

  • AGRICLUTURE
  • INDUSTRIES
  • MANDALS AND VILLEGES
  • IRRIGATION
  • ELECTRICITY
  • HEALTH SERVICES
  • ROADS
  • CLIMATE
  • BOUNDARIES
  • HILLS AND RIVERS

ARTS & CULTURE

  • తెనుగుపల్లె 'ఫరానా'..సామల సదా శివ
  • The dancing duo Raja and Radha Reddy
  • Dhokra metal craft, Adilabad

మన జిల్లా ఒడిలో అదిరేటి అందాలు


మన ఆదిలాబాద్ జిలాలో అడవిమాటున ఉన్న ప్రకృతి అందాలు పర్యాటకులను కనువిందులని చేస్తాయి. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, వాగులు, వంకలు లోయలు ప్రకృతి సహజ సిద్దంగా ఏర్పడిన సుందర జలపాతాలు మది దోచేస్తాయి. కాని జిల్లాలో కుంటాల పోచ్చేర జలపాతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాని బాహ్య ప్రపంచానికి ఎరుగని మరెన్నో అద్బుతమైన ప్రకృతి అందాలు ఇప్పటికి మన ఆదిలాబాద్ జిల్లాలో అడవుల మాటున దాగి ఉన్నాయి. ఏజెన్సి లోని తిర్యాని, నార్నూర్, జైనూర్, ఆసిఫాబాద్ సిర్పూర్ (యు)మండలాల్లో దట్టమైన అటవీ ప్రాంతాల్లో బారి బండ రాళ్ళు.శిలల మద్య ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాల మద్య జాలువారే సుందర జలపాతాలు చూపరులకు కనువిన్దుని చేస్తాయి. సెలయేటి గలగలలు..పక్షుల కిలకిల రాగాలు పచ్చని దట్టమైన అడవులు పర్యాటకులని విశేషంగా ఆకర్షిస్తాయి.
జైనూర్ మండలం మారుమూల గ్రామమైన అడ్డేసార గ్రామా శివారులో బండ రాళ్ళ మద్య పారుతున్న సెలయేటి నీటి దృశ్యాలు..పాలరాతిని తలపించే శిలలు కలిగిన బండరాళ్ళు చుపరులని అబ్బుర పరుస్తాయి. జలపాతానికి వెళ్ళాలంటే జైనూర్ మండల కేంద్రం నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్ళే రహదారి గుండా 18 కిలోమీటర్లు ప్రయాణించాలి. అంతకుముందు ఆ రహదారి పొడవున బూసిమెట్ట గ్రామ పోలిమేరలోని ఉన్న దట్టమైన అడవులు, ఘాట్ రహదారి అందాలు పర్యాటకుల మనసుని దోచేస్తాయి.
ఇదే మండలం లోని పానపటార్ గ్రామ సమీపంలోని పారకప్పి జలపాతంలో పాటు గూడమామడ,దబోలి శివారు ప్రాంతంలో కొక్కర్ కసా జలపాతం దృశ్యాలు చుపరులని మంత్రముగ్డులని చేస్తాయి.

తిర్యాని మండలంలోని పంగిడి మాదర గ్రామా పంచాయితీ పరిదిలో వర్షాకాలంలో వరద ఉద్రుతికి జాలువారే చింతలమాదర జలపాతం నీటి దృశ్యాలు కనువిందు చేస్తాయి.చుట్టూ పంట పొలాలు,పచ్చదనం పరుచుకున్న అడవులు,పక్షుల కుహు కుహు రాగాలు వినసొంపుగా ఆనందాన్ని పంచుకుంటాయి.బాహ్య ప్రపంచానికి ఎరుగని జలపాతాన్ని చూడాలంటే ఆసిఫాబాద్ నుంచి రోమ్పల్లికి వెళ్ళే బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది.చింతలమాదిరి గ్రామంలో బస్సు దిగి ఆ ప్రాంతానికి చేరుకోవడానికి కిలోమీటరు కాలినడక ప్రయాణించాల్సి ఉంటుంది.గ్రామం నుంచి అక్కడికి వేలాలంటే రహదారి సౌకర్యం పోలంగాట్లమద్య నడుచుకుంటూ ప్రకృతి అందాలను తిలకిస్తూ వెళ్తుంటే ఆహ్లాదకర వాతావరణం మనస్సు పరవసిన్చేలా చేస్తుంది.

Click hear for view more..

INDUSTRIES

  • Sirpur Paper Mills Limited
  • సిరుల మాగని మన సింగరేణి.

ఘన చరిత్ర కలిగిన మన రుయ్యాడి పీరిలు

Ruyyadi is an one of the Village in Talamadugu Mandal , Adilabad District , Andhra Pradesh State . Ruyyadi is 2.5 km distance from its Mandal Main Town Talamadugu . Ruyyadi is 13.8 km distance from its District Main City Adilabad . And 251 km distance from its State Main City Hyderabad.
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సవార్లపండగని మన ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం రుయ్యాడి, తలమడుగు గ్రామాల్లో కుల, మత బేదం లేకుండా బక్తి శ్రద్దలతో జరుపుకొనే ఈ పండగకు రాష్టం నలుమూలలనుండి బక్తులు వస్తుంటారు. ముస్లిం ప్రవక్త మహమద్ హజ్రత్ హుస్సేన్ సాజిత్ అనే కలీపా స్ముర్థి కోసం ఈ పండగను నిర్వహిస్తారు. హుస్సేన్ హుస్సేన్ గా హిందువులు ఆశన్న ఊసన్నలుగా పిలుచుకుంటూ మొక్కులు పెడతారు. తొమ్మిది రోజులు ఎంతో ఉసాహంగా సవార్లను ఆట పాటలతో కొలిచి పదో రోజు ఎంతో దుఖసాగరంలో పీరిలను వాగుకు తీసుకెళతారు. ప్రత్యెక పూజ కార్యక్రమాలతో పండగను ముగిస్తారు..
మన జిలాల్లోని తలమడుగు మండలం రుయ్యాడి, తలమడుగు పీరిలు రాష్ట స్తాయిలో ప్రత్యెక పేరు గాంచాయి.పూర్వకాలం నుంచి రుయ్యడి గ్రామం లో ఒకే ఒక ముస్లిం కుటుంబం నివాసముంటున్న గ్రామంలోని హిందువు కుటుంబాలంతా కలిసే పీరీల ఉత్సవాలను బారి ఎత్తున నిర్వహిస్తారు. తలమడుగులో సైతం అన్ని వర్గాల ప్రజలు అత్యంత బక్తి శ్రద్దలతో పండుగని జరుపుకొంటారు. దీనికోసం బక్తులు భారి సంక్యలో ఉత్సవాలకు వస్తుంటారు.పీరిలకోసం లక్షలాది రూపాలతో హుస్సేన్ హుస్సేన్ భవనం, బక్తుల కొరకు నూతనంగా విశ్రాంతి బాణం నిర్మించారు. ఉత్సవాలల్లో బాగంగా సవార్లు కట్టిన నాటినుంచి మూడు రోజులనుంచి ఇక్కడ మద్యం మాంసం చెప్పులు సైతం ఎవరు వేసుకోకుండా దూరంగా ఉంటారు.

Click hear for view more..

Adilabad History

img img

పురాతన సంస్కృతీ సాంప్రదాయాలు, చారిత్రిక వారసత్వ సంపదతో మన ఆదిలాబాద్ జిల్లా అలరారుతోంది .ఆదిలాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఇక్కడి అందాలు.. విభిన్న సంస్కృతులు.. సంప్రదాయాలు. అందాలకు తోడు మన జిల్లా ఎన్నో ప్రత్యేకతలను కూడా తన సొంతం చేసుకుంది. పచ్చని అడవులు.. ఆహ్లాద పరిచే జలపాతాలు..దట్టమైన అబయారన్యాలు..ఎత్తైన కొండలే కాకుండా, పొనికి కర్రతో కళాకారుల చేతిలో అద్బుతంగా రూపుదిద్దుకునే నిర్మల్ కొయ్య బొమ్మలు..ఇక్కడి ప్రాచీన కట్టడాలు, అబ్బుర పరిచే శిల్పాలు నేటికి మనకు కనువిందు చేస్తున్నాయి. వ్యాస మహర్షి నిర్మించినట్లు చెపుతున్న బాసర సరస్వతి దేవాలయం, నిమ్మనాయుడి కాలంనాటి నిర్మల్ కోటలు, జైనుల కాలంనాటి జైనథ్ సూర్యనారాయణ ఆలయం, ప్రక్యాతి గాంచిన కథిలి పాపహరేస్వరాలయం, గూడెం సత్యనారాయనుడి ఆలయం, అడవిలో వెలిసిన గండి పోచేమ్మ ఆలయం, ఇవే కాక ప్రకృతి ఒడిలో ఉన్న ఆలయాలు జిల్లాకే వన్నె తెస్తునాయి..అడవుల జిల్లాకు తలమానికంగా నిలిచినా ప్రాచీన కట్టడాలను మరియు పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఒక జిల్లా వాసిగా నా వంతు కృషిగా www.adilabadyatra.com అనే వెబ్ సైటు ను రూపొందించాను. ఒక సారి ఈ వెబ్ సైట్ ని క్లిక్ చేసి మీ అబిప్రాయాలను నాతో పంచుకోండి.

History: The Adilabad district was named after the ruler of Bijapur Sultanate, Ali Adil Shah. The district was for long not a homogeneous unit and its component parts were ruled at different periods by dynasties namely, the Mauryas, Staavahanas, Vakatakas, Chaludyas of Badami, Rashtrakututs, Chalukyas of Kalyani, Mughals, Bhosle Rajes of Nagpur and Asaf Jahis, besides the Gond Rajas of Sirpur and Chanda. Originally this was a sub-district named Sirpur-Tandur which was created in A.D. 1872 with Edlabad (Adilabad), Rajura and Sirpur as its constituent talukas. In 1905, an independent district with headquarters at Adilabad was formed.
Adilabad is the second largest district in the Telangana Region.

THIS SITE WAS DEVELOPED BY MR.DINESH REDDY K,PO:WADYAL, MDL:LAXMANCHANDA, DIST:ADILABAD, CELL:9440122764 FOR ANY INFORMATION REGARDING ABOUT THIS SITE PLEASE CONTACT ME ON MAIL: dineshmca9@gmail.com * *
ఉత్తరవాహిని తీరం..ఒక ఆద్యాత్మిక తీరం..మరో కాశి పుణ్యక్షేత్రం..గోదారమ్మ తూర్పునకు మళ్ళింది..పూరి జగన్నాతుడి తర్వాత స్థానం చెన్నూర్ ది..కత్తేరసాల మల్లన్న స్వామి శెరను శెరను..అగస్తేశ్వరాలయం..మరో శబరిమల మన కడ్తాల్ అయ్యప్ప ఆలయం..
Geography:

The district is situated between 77.46' and 80.01', of the eastern longitudes and 18.40' and 19.56', of northern latitudes. The district is situated on the northern boundary of Andhra Pradesh, forming a border with the Yeotmal and Chanda districts of Maharashtra on the north, east and western borders and Nizamabad and Karimnagar districts of Andhra Pradesh on the southern border. The district occupies an area of 16,128 km² and is the fifth largest in Andhra Pradesh, occupying 5.90 percent of the area in Andhra Pradesh. The Sahyadri parvat or Satnala range traverses the district from the north-west to the south-east for about 281.5 kilometers. In this range the Mahbubghat is the highest peak.
The most important river that drains the district is the River Godavari. The Penganga River, Wardha and Pranahita also drain the region. The Kadam and the Peddavagu are tributaries of the Godavari. There are also streams like Satnala, Swarnavagu, and Suddavagu which drain the district. The Godavari which is the largest river in peninsular India raises in the Western Ghats and enters this district near Basara in Mudhole Taluk. This mighty river forms the southern boundary of the district separating it from Nizamabad and Karimnagar districts. The Penganga forms part of the northern boundary of the district in Adilabad, while the Wardha and the Pranahita from the northern and eastern boundaries of the district.

read more

Tourist Attractions :

img

As Adilabad is mostly surrounded by deciduous forests there is a great possibility of coming across beautiful landscapes covered in green( mostly rainy season) which makes this place adorable.Some of the tourist attractions are The temple of Goddess Saraswathi, the one and only temple of this deity in South India, located at Basar is a famous pilgrim place. Another temple famous pilgrim place is Jainath temple, which is located at Jainath and this is the temple of Sri Laxmi Narayana Swamy.The people there say that in the early years when the sun raises the first light of sun i.e., suryakinalu would first touch the feet of sri Laxmi Narayana Swamy's idol present in the garbha gudi interesting.The below photograph show the inside view od the temple. The other main attractions like Nirmal Arts, paintings and toys are very much famous & popular. There are famous waterfalls like Kuntala waterfalls, Pochera waterfalls and Utnur temple situated at Utnur a famous pilgrim place like this many other places and landscapes which will make you delighted to visit those places I bet.

read more

మన జిల్లాకే ప్రత్యేకత..పర్యాటకుల మదిని దోచే శివరాం మొసళ్ళ పునరావాస కేంద్రం !



ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు పొందిన మన జిల్లాలోని జైపూర్ మండలం శివ్వారం గ్రామ సమీపంలోని గోదావరి నది ఎల్. మడుగులో ఉన్న మొసళ్ల పునరావాస కేంద్రం పర్యాటకులను అబ్బుర పరుస్తుంది. అందులోని మొసళ్లు, నీటి కుక్కలు, కృష్ణ జింకలు, నెమళ్లు, దుప్పులు, పందులు, ముళ్లపందు లు అనేక రకాల పక్షుల పర్యాటకులకు కనువిందు చేస్తాయి.
శివ్వారంలోని ఎల్. మడుగు అతి పురాతనమైంది. 1978లో పుష్పకుమార్ అనే వైల్డ్‌లైఫ్ నిపుణుడు ఈ ప్రాంతాన్ని తొలిసారి సందర్శించి అవాక్కయ్యారు. ఈ ప్రాంతంలోని అభయారణ్యం, జీవవైవిధ్యం గురించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాడు. ప్రభుత్వం అప్పుడే ఈ ప్రాంతాన్ని మొసళ్ల పునరావాస కేంద్రంగా ప్రకటించింది. కాకతీయుల కాలం నాటి ఈ మడుగు వెడల్పు 9 కిలోమీటర్లు. పొడవు 29 కిలోమీటర్లు. తాటి చెట్టు వేస్తే అందనంత లోతులో 20 మీటర్ల మేరకు నీళ్లుంటాయి. అనేక రకాల జల, ఉభయచర జీవులు ఈ మడుగులో ఉన్నాయి. 26కుపైగా మొసళ్లు, 102 నీటి కుక్కలు, అరుదుగా ఉండే దొనచేప, స్టార్‌ఫిష్‌లతోపాటు రకరకాల చేపలు, నీటి జంతువులు జీవిస్తున్నాయి.
మడుగు చుట్టూ ద ట్టమైన చెట్లు, మంచి వాతావరణం ఉండడంతో కృష్ణ జింకలు, గడ్డి జింకలు, అడవి కోళ్లు, నెమళ్లు, చుక్కలడిప్పి(దుప్పులు), అడవి పందులు, ముళ్లపందులు వందల సంఖ్యలో నివాసం ఏర్పర్చుకున్నాయి. ఈ వన్యప్రాణులు దాహం తీర్చుకునేందుకు అటవీ శాఖాధికారులు ఐదు కుంటలు, ఎనిమిది సాసర్లు(నీళ్లు నీల్వ ఉండే) నిర్మించారు. దీంతోపాటు 20 చోట్ల నిరంతర ప్రవాహానికి అడ్డుకట్టలు వేశారు.
మొసళ్ల పునరావాస కేంద్రానికి వెళ్లాలంటే శివ్వారం గ్రామం నుంచి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. ఇందులో రెండు కిలోమీటర్ల మేర రాళ్లు, రప్పలు, చెట్లు, చిన్నచిన్న మొక్కలు నరుక్కుంటూ మడుగుకు చేరుకోవాల్సి ఉంటుంది. జంతువులు సంచరిస్తాయి. మామూలు వాళ్లు వెళ్లలేదు. ఎనిమల్ ట్రాకర్స్ ద్వారానే ఈ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది.
పునరావాస కేంద్రంలో జంతువులు..
మొసళ్లు 26, నీటి కుక్కలు 102, నెమళ్లు 100, అడవి పందులు 100, అడవి కోళ్లు (కర్కోలు) 100, చుక్కల దుప్పులు 10, ముళ్ల పందులు 10, కొండగొర్రెలు 10, కృష్ణ జింకలు 07, గడ్డి జింకలు 06.

read more

Note :-
Is there any small / big local tourism Places (or) Temples (or) picnic spots (or) any other attraction places in your area?
Please mail that detailed information along with Photos to dineshmca9@gmail.com. we will show that information on this website.

అందాల సమాహారం మన ఆదిలాబాద్ జిల్లా..

img

ఆదిలాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఇక్కడి అందాలు.. విభిన్న సంస్కృతులు.. సంప్రదాయాలు. అందాలకు తోడు ఈ జిల్లా ఎన్నో ప్రత్యేకతలను కూడా తన సొంతం చే సుకుంది. పచ్చని అడవులు.. ఆహ్లాద పరిచే జలపాతాలు.. ఎత్తై కొండలే కాకుండా.. చదువు ల తల్లి సరస్వతీ దేవి కూడా ఇక్కడే కొలువుదీరడం విశేషం.
జల సోయగం..
పచ్చని అడవి తల్లి ఒడిలో జాలువారే అందాలూ బోలెడు. ఈ అందాలకు నిలయం బోథ్ నియోజకవర్గం. రాష్ట్రస్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన జలపాతాలు కుంటాల, పొచ్చెర. సప్తగుండాల పేరుతో ఏడు గుండాలు నియోజకవర్గంలోనే ఉన్నాయి. బోథ్ మండలంలో పొచ్చెరతోపాటు మహారాష్ట్ర సరిహద్దులోని ఘన్‌పూర్ పరిసరాల్లో, బజార్‌హత్నూర్‌లోని కనకాయి, నేరడిగొండలో కుంటాల, కొరిటికల్, గుత్పాల జలపాతాలు, నేరడిగొండ, ఇచ్చోడ సరిహద్దు ప్రాంతంలో గాయత్రీలు కనువిందు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎత్తై జలపాతాలలో అగ్రస్థానంలో కుంటాల నిలుస్తుంది. నిర్మల్ ఆదిలాబాద్ మధ్య జాతీయ రహదారిపై నేరడిగొండ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. నేరడిగొండ నుంచి ఆదిలాబాద్ వైపు రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే బోథ్ ఎక్స్ రోడ్డు నుంచి బోథ్ వైపు ఐదు కిలోమీటర్లు లోపలికి వస్తే పొచ్చెర జలపాతం ఉంటుంది. ఈ రెండు జలపాతాలను సందర్శించేందుకు ఏటా రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా.. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తదితర రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుండడం విశేషం.
ఆహ్లాదపరిచే అడ వుల అందాలు..
అడవులకు కేరాఫ్ ఆదిలాబాద్. జిల్లాల ఎక్కడికి వెళ్లినా ధట్టమైన అడవులు.. ఎత్తై కొండలు కనిపిస్తాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కవ్వాల్ అభయారణ్యం. ఈ అభయారణ్యం ప్రకృతి సోయగాలతో అందరినీ మంత్రముగ్దుల్ని చేస్తోంది. వీటికితోడు మహెబూబ్‌ఘాట్స్, కెరమెరి ఘాట్స్.. నూతనంగా ఆధునికీకరించిన నాలుగు లేన్ల 44 జాతీయ రహదారి కనువిందు చేస్తుంటాయి.
కొయ్యబొమ్మలు కేరాఫ్ నిర్మల్
కొయ్యబొమ్మల తయారీకి నిర్మల్ కేంద్రం కేరాఫ్‌గా మారింది. జాతీయ స్థాయిలో ఇక్కడి కొయ్యబొమ్మలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మల్‌ను పాలించిన నిమ్మనాయుని కాలంలో ఈ కళ జీవం పోసుకుంది. పొనికి కర్రతో కళాకారుల చేతిలో రూపుదిద్దుకునే ఈ బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
ఇంద్రవెల్లి అమరవీరు ల స్తూపం
అడవి బిడ్డల హ క్కుల సాధనకు.. సమస్యల పరి ష్కారానికి ఉద్యమించి అసువు లు బాసిన వారి స్మారకార్థం ని ర్మించింది ఇంద్రవెల్లి అమరవీరు ల స్తూపం.
కడెం..
జిల్లాలో మరో చెప్పుకోదగ్గ పర్యాటక క్షేత్రం కడెం. ఈ ప్రాజెక్టుకు ఏటా రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి సేద తీరుతుంటారు. పిల్లల కోసం ప్రత్యేక ఆటపరికరాలు.. తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రెండేళ్ల క్రితం ఏపీ టూరిజం ఆధ్వర్యంలో బోటింగ్ కేంద్రం ప్రా రంభించారు. ప్రస్తుతం అందులో 20 మంది కూర్చుండే డీలక్లు బోటు, నలుగురు కూర్చుండే స్పీడ్ బోటు అందుబాటులో ఉంది. అయితే.. జిల్లాలోనే ఈ ప్రాజెక్టు అతిపెద్దది కావడంతో తిలకించడానికి సెలవు రోజుల్లో పర్యాటకులు భారీగా వస్తుంటారు.
బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయం
ఆదిలాబాద్ అంటేనే గుర్తుకు వచ్చేది బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయం. దక్షిణ భారతదేశంలో ఏకైక సరస్వతీ మాత నెలకొని ఉన్న ప్రదేశంగా బాసరకు పేరుంది. జిల్లా సరిహద్దులో గోదావరి ప్రవేశించే చోట నెలకొని ఉన్న జ్ఞాన సరస్వతీ ఆలయం చదువుల తల్లిగా పేరొందింది.
మరి కొన్ని పర్యాటక ప్రాంతాలు..
16వ శతాబ్ద కాలంలో నిమ్మనాయుడు ఏలిన నిర్మల్ పట్టణం ఖండాంతర ఖ్యాతిని పొందింది.
ఆకులో ఆకునై... పూవులో పూవ్వునై అన్నట్లు నిర్మల్ నకాశీల చేతుల్లో ప్రాణం పోసుకుంటున్న కళాఖండాలను చూసేందుకు కనులు చాలవు.
జిల్లాలోని కడెం, సాత్నాల , స్వర్ణ , వట్టి వాగు, చెలిమెల వాగు ప్రాజెక్టు అందాలు అబ్బురపరుస్తాయి.
జన్నారం, కడెం మండలాలను ఆనుకుని ఉన్న కవ్వాల్ అభయారణ్యం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతంలోనే పులులతోపాటు అనేక జీవరాశులకు, వన్యవూపాణులకు నెలవుగా మారింది.
జన్నారంలోని జింకల సంరక్షణ కేంద్రం, చెన్నూర్‌లోని మొసళ్ల సంరక్షణ కేంద్రం చూడదగినవి.
మరో పక్క దట్టమైన అడవుల్లో నుంచి జాలువారే కుంటాల జలపాతం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచింది. కుంటాలతోపాటు పొచ్చెర, గాయిత్రి గుండం, సిర్పూర్ ప్రాంతంలోని ఏడు మిట్టెలు, ఆసిఫాబాద్ ప్రాంతంలోని మోవాడ్ జలపాతం, కెరమెరిలోని శంకర్‌లొద్ది గుండాలు ఆకట్టుకుంటాయి.
అభయారణ్యాన్నిచీల్చుకుంటూ వెళ్ళే నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్నసహ్యాద్రి పర్వత శ్రేణులు ఐన మహాబూభ ఘాట్ గుట్టలు, ఉట్నూర్ నుంచి ఆసిఫాబాద్ దారిలో ఉన్న కేరమారి గుట్టలు అద్భుతంగా ఉంటాయి.ఎత్తైన కొండప్రదేశం నుంచి చూస్తే ఈ ఘాట్లు మంత్ర ముగ్ధులను చేస్తాయి.
img నిమ్మ నాయుడి కాలం నాటి కోటలు,భురుజులు,గొలుసుకట్టు చెరువులు,ఉట్నూర్ లోని గోండ్రాజుల ఖిల్లా నేటికి నాటి రాచరిక పాలనకు సాక్షిబూతంగా ఉన్నాయి. పాత జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ లో జిల్లా జైలు,నైజం కాలం నాటి పరిపాలన భవనాలు,విశ్రాన్త్రి గృహాలు ఉన్నపటికీ శితిలవస్తకు చేరుకున్నాయి.ఈ కోటలు,బురుజులు కాలక్రమేనా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదముంది..
జైనథ్ సూర్య దేవాలయం,కల్లూర్ సాయిబాబా మందిరం,నిర్మల్ అయ్యప్ప హరిహర క్షేత్రం,వేలాల రాజరాజేశ్వర స్వామి ఆలయం,గూడెం సత్యనారాయణస్వామి ఆలయం,చేనూర్ త్రివేణి సంగమం,కాగజ్ నగర్ లో ప్రాణహిత నది ని చూడవొచ్చు.
గోండు రాజుల గత వైబవం ను తెలిపే కోటలు ఉట్నూర్ లో దర్శనమిస్తాయి.18 వ శతాబ్దంలో హనుమంత రాయుడు నిర్మించిన కోటలు గోండు రాజుల చరిత్రకు ఈ కోట సజీవ సాక్షంగ నిలుస్తోంది.
మందమర్రిలోని చారిత్రాత్మక ప్రదేశం గొండురాజుల గాందరిఖిలా గుట్టపై బావులు,సొరంగ మార్గం,శిలాశాసనం ఉన్నాయి.ఆదివాసులు పూజించే దేవతా మూర్తులు ఉన్నాయి.నాగోబా విగ్రహం ఉంది.నేటికి ఈ ప్రాంత వాసులు అక్కడకు వెళ్లి పూజలు చేస్తారు.

read more

ప్రకృతి రమణీయం..కనులకు కమనీయం మన జిల్లాలోని సమతలగుండం జలపాతం

చుట్టూ ఎత్తైన కొండలు..పర్వత వాలుల నుంచి గలగలా పారే మంచు పలకల లాంటి సెలయేళ్ళు.. పాలపొంగులాంటి సుందర జలపాతాలు..కాష్మీరును తలపించే లోయల అందాలు..ప్రకృతి కే వన్నేతెచే పచ్చని వనాలు..పక్షుల కిలకిల రావాలు..వన్యప్రాణుల అడుగు జాడలు..స్వచమైన గాలి, నీరు, ప్రశాంత వాతావరణం..ప్రకృతి సౌందర్యమంత ఒక్క చోట కలపోసినట్లు కనిపించే కమనీయ దృశ్యాలకు పర్యాటకులు ముగ్డులవుతారు. దారికూడా సక్రమంగా లేని మారుమూల కీకారణ్యంలో పొదిగిన ప్రకృతి రూప సొబగులివి. ఆసిఫాబాద్ మండలం లోని సమతుల గుండం(ఆసిఫాబాద్ నుంచి నుండి 30 km దూరం లో ఉంది)జలపాత సహజ సౌందర్య మాలిక ఇది.అడవితల్లి ఒడిలో రమణీయమైన ఈ జలపాత దృశ్యాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇంతవరకు స్తానికులకే తెలిసిన ఈ చారిత్రాత్మక జలపాతం మన వెబ్ సైట్ ద్వారా ప్రపంచాని తెలియాలని ఆశిద్దాం.

read more

మన జిల్లాకే ప్రత్యేకత..ఆదివాసి గిరిజన గూడేల్లో గుస్సాడి దండారి సంబురాలు



జిల్లాలోని ఆదివాసి గిరిజనులు సంస్కృతి సాంప్రదాయలకు పెద్దపీట వేస్తారు.ప్రతి పండగను వారి సాంప్రదాయంగా జరుపుకొంటారు.అందులో ఒక్కో పండగకి ఒక్కో చరిత్ర ఉంటుంద .దండారి కోలాటలు,మహిళల రేలా..రేలా నృత్యాలు తో గూడేలు మార్మోగుతాయి. ఆదివాసీలు దండారి పండుగ సమయంలో ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్తారు. బందువులకు రాచ మర్యాదలతో గ్రామానికి స్వాగతం పలికి ఏర్పాట్లు చేస్తుంటారు. అక్కడ ఉత్సవాల్లో యువతీ యువకులు నృత్యాలు చేస్తారు. నెమలి ఈకలతో తయారు చేసిన తోపిలను దరించి వివిధ వేసదారనలతో చిన్నారులు పెద్దలు కలిపి(గోండు బాసలో పిలిచే) వెట్టు, పర్ర, గుమ్మేల, కోడాల్, తప్పల్, చప్పుళ సవ్వడులతో నృత్యాలు చేస్తారు.అందులో బాగంగా పెళ్లి సంబందాలు కుదుర్చుకుంటారు. దండారి ఉత్సవాల్లో పురుషులు,మహిళలు వయో బేదాలు లేకుండా కోలాటాలు, రేలా..రేలా నృత్యాలు చేస్తారు. అట, పాటలతో దండారి(గుస్సాడి) పండుగని జరుపుకొంటారు. ఇప్పటికి ఈ జీవ వైవిద్యం అనుసారంగానే ఆదివాసి గోండులు, కోలాం గిరిజనులు ఆచారవ్యవహారాలను కాపాడుతున్నారు.

read more
HTML Comment Box is loading comments...

Copyright 2011. All Rights reserved www.adilabadyatra.com

Developed by Dinesh Reddy K.